Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిలో పక్షులు అన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో కోడి కొక్కురుకో అంటూ సభ ప్రారంభించినది. కోయిల తన తీయని గానంతో స్వాగతం పలికింది. కిలకిల రవములతో పదుల సభ కోలాహలంగా వుంది. రామచిలుక రండి కూర్చోండి అంటూ అన్నీ పక్షులను ఆహ్వానం పలికినది. ఈ సభకు ముఖ్య అతిధిగా, పక్షుల గురువు డేగ ఎగురు కుంటూ వచ్చింది.
పక్షుల మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు సభ ఉద్దేశం ఏమిటంటే మన పక్షి జాతి అంతరించి పోకుండా మనం తగిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మన అందరికీ శుభోదయం అంది డేగ. అవును అది సరే ఈ అడని మనకు రక్షణగా ఉంటోంది. కానీ కొందరు అడవి దొంగలు ఈ అడవిలో మాటు వేసి వారి చేతికి దొరికిన పక్షులను కాల్చుకొని తింటున్నారు. ఎలా బ్రతకడం అంది నెమలి, మీరు ఆకాశంలో స్వేచ్చగా, హాయిగా ఎగిరే పక్షులు కాబట్టి కాస్త తెలివిగా వ్యవహరించాలి. అంది డేగ, భూమి పై వలలు వేసి పట్టుకునే వేటగాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువగా అయ్యారు. ఎలా అంటూ అడిగింది పిచ్చుక, చెప్పాను కదా తెలివి ఉపయోగించండి గింజలు చల్లారు అంటే వల వేశారు అని అర్థం అంటూ పావురం చెప్పింది. ఈ మానవులు నా జోలికి వస్తే వాళ్ళ కళ్ళను పీకేస్తాను. అంది గుడ్లగూబ... జ్యోతిష్యం చెప్పే వాడు నాతో మూడు ముక్కలు తీయించి సరిగ్గా తిండి కూడా పెట్టడు. అని చెప్పింది రామచిలుక, పూర్వం నాతోనే ఉత్తరం రాసి పంపేవారు ఇప్పుడు నన్ను అందరూ పూర్తిగా మరిచి పోయారు అని చెప్పింది పావురం దిగులుగా,
''అర్ధం అయింది మనం అందరూ హాయిగా ఎగురగలం పొద్దున్నే అలా వెళ్లి ఎవరి మేత వారు సంపాదించి రాత్రి వేళకు అడవికి రండి. ఎవరి జాగ్రత్త లో వాళ్ళు వుండండి. మన అందరికీ అడవి మాతల్లి రక్షణగా వుంది. అంతే కాదు అవుసరం అయితే మనం ఇతరులను కాపాడడం కోసం మానవులు అయినా సరే ఆపదలో వుంటే జటాయువు పక్షిలా ప్రాణాలు తెగించి పోరాడాలి! తెలిసిందా! మన పక్షి జాతికి ఆదర్శం జటాయువు పక్షి అలనాడు సీతమ్మ ను కాపాడడం కోసం దుష్టుడు అయిన రావణాసురుడిని ఎదుర్కొని చివరకు తన ప్రాణాలు త్యాగం చేసిన ఘనత మన ఆ పక్షి రాజుచే ''నని గర్వంగా చెప్పింది డేగ. ''ఏది ఏమైనా మీరు అందరూ కలిసి వుండండి. కలసి ఉంటే కలదు సుఖం'' అంటూ చెప్పింది పక్షుల గురువు డేగ, అలాగేనని మిగతా పక్షులు అన్నీ సమ్మతించాయి. అప్పటి నుంచి అని ఎవరి జాగ్రత్తలో అవి వున్నాయి.
- లక్కరాజు ప్రపుల్ల చంద్ర