Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నపళాన లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఒక్కసారిగా బంధీనయ్యాను...
అక్వేరియం గాజుగోడల మధ్య దిక్కుతోచని చేపలా!..
చలనం ఆగిపోయిందనిపించింది... ఊపిరాడని పరిస్థితిలోకి నెట్టినేయబడ్డాననుకున్నా... కానీ నా మనసుకు తెలుస్తోంది...
ఇప్పుడే ఊపిరి పీల్చుకోవడం మొదలైందని !...
రోజూ చూసేవే... అప్పటి వరకూ చాలా అల్పమైనవిగా
అనిపించేవేవేవో... నా కళ్లకు ప్రత్యేకంగా ఆకట్టుకోసాగాయి....
ఒకప్పుడు పట్టించుకోని పలకరింపులన్నీ దోసిలిలో ఏరుకునేలా... నేను ఎవరో ఏంటో తెలుసుకునేలా... నా కోసమే ఎదురు చూసేవారిని
నేను చూసేలా...
అందని దూరాల వెంట పరుగులు తీసే నేను ఇప్పుడు నా వారిని చూస్తున్నాను... అంతులేని ఆనందంకోసం వెంపర్లాడిన నేను
నాచుట్టూ ఉన్న హరివిల్లును చూస్తున్నాను..
- సాయి చరణ్,
97003 01713