Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. అమెరికాలోని న్యూ మెక్సికో ప్రాంతంలో షిప్రోఖ్ మంచు పర్వతం ఉంది. ఈ పర్వతం ఎత్తు 2,188 మీటర్లు. 1970లో ఓ పర్వతారోహకుడు ఈ పర్వతాన్ని ఎక్కుతూ మరణించాడు.
మరోవైపు 'నవజొ' అనే స్థానిక అమెరికన్ల మత విశ్వాసాలు, వారి సంస్కతిని పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో, 1970లో ఈ పర్వతాన్ని నిషేధించారు.
2. ఆస్ట్రేలియా పసిఫిక్ తీరం నుంచి 787 కి.మీ.దూరంలో ఉన్న పురాతన లావా అవశేషాలే ఈ బాల్స్ పిరమిడ్. యునెస్కో 1986లో ఈ పర్వతాలను వారసత్వ సంపదగా గుర్తించింది.
అయితే అదే సంవత్సరంలోనే ఈ పర్వతాలను అధిరోహించడాన్ని నిషేధించారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది. పర్వతా రోహకుల వల్ల ఆ ప్రాంతం కాలుష్య మవుతుండటంతో ఆ పర్వతాలపై ఉండే అరుదైన కీటకాలు అంతరించిపోతున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కానీ కొంత మంది రహస్యంగా అధిరోహిస్తూనే ఉన్నారు.
3. భూటాన్లోని గాంగ్కర్ ప్యుఎన్సమ్ పర్వతం ఎత్తు 7,570 మీటర్లు. హిమాలయ పర్వత శ్రేణిలో నేపాల్, భూటాన్ దేశాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. స్థానికుల మత విశ్వాసాలను
కాపాడటం కోసం ఈ పర్వతం పైకి ఎవరూ ఎక్కరాదంటూ భూటాన్ ప్రభుత్వం 1994లో ఆదేశాలు జారీచేసింది. వాతావరణ కారణాల దృష్ట్యా 2003లో పర్వతారోహణను పూర్తిగా నిషేధించింది.
4 ఫిలిప్పీన్స్ లోని మౌంట్ బనాహా పర్వతాల ఎత్తు 2,170 మీటర్లు. ఈ లావా పర్వతాలను స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తారు. 1994 వరకూ పర్వతారోహణం కొనసాగింది. కానీ, పర్యావరణవేత్తల సూచనల మేరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిషేధాన్ని జారీ చేసింది.