Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుద్యోగం దేశాన్ని వెంటాడుతూనేవుంది. కోవిడ్ విజంభణ, అనాలోచిత లాక్డౌన్ నిర్ణయం అనంతరం... పారిశ్రామిక, చిన్న తరహా వ్యాపారాలు, సేవా రంగం, ప్రధానంగా అసంఘటిత రంగంలో కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఐఎల్ఓ-2020 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ పురుషులతో పోల్చుకుంటే మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. 2019 కంటే 2021లో మహిళల ఉద్యోగాలు 1.30 కోట్లు తక్కువగా ఉంటాయి' అని ఐఎల్ఓ ఎంప్లారుమెంట్ పాలసీ, జెండర్ స్పెషలిస్ట్ వలేరియా పేర్కోంది. గతేడాది ఐఎల్ఓ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2008-09లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుతం మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితి దిగజారడం గమనార్హం. ఐఎల్ఓ అంచనాల ప్రకారం ప్రస్తుతం 2021 పురుషులు, మహిళల ఉపాధి పుంజుకునే అవకాశమున్నప్పటికీ అది మహిళల్లో మందకొడిగానే సాగుతోంది.
ప్రభుత్వ నయా ఉదారవాద విధానాల వల్ల శ్రామికుల కష్టం శ్రమ కారుచౌకగా కొల్లగొట్టబడుతున్నది. పెరుగుతున్న ధరలు, ప్రపంచీకరణ నేపథ్యంలో శ్రామిక మహిళల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది. పోరాడి సమానపనికి సమానవేతన చట్టం (1976) సాధించుకున్నప్పటికీ అమలులో మాత్రం పురుషుల కంటే మహిళలకు దాదాపు 30శాతం తక్కువ జీతం లభిస్తున్నది. అసంఘటిత రంగంలో మెజారిటీగా ఉన్న శ్రామిక మహిళలకి ఉద్యోగ భద్రత, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఇతర మౌలిక సదుపాయాల వంటి ఎలాంటి హక్కులూ వర్తించట్లేదు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, కాంటిజెంట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్‌గా రకరకాల పేర్లతో మహిళలలే ఎక్కువ. సామాజిక భద్రతకు దూరం చేస్తున్నది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. లైంగిక వేధింపుల చట్టాలు కాగితాలకే పరిమితమవ్వడంతో మహిళా ఉద్యోగినుల సంఖ్య రోజురోజుకీ పడిపోతున్నది. రాత్రివేళల్లో పనిచేయాల్సిన ఉద్యోగాల్లో, నగరాలల్లో శివారు ప్రాంతాలల్లో ఉన్న కార్యాలయాలల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య మరింతగా తగ్గుతున్నదని తేల్చింది. ఈ సర్వేలో 48శాతం మంది మహిళలు తమకు గత రెండేండ్లలో భద్రతాపరమైన భయాలు మరింతగా పెరిగాయంటున్నారు. ఇలాంటి వాటిపై తక్షణమే ప్రభుత్వాలు స్పందించి మహిళా భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి.
దేశంలోని లక్షలాది కుటుంబాల కష్టాలను ఈ నిరుద్యోగ విస్తతి మరింత పెంచుతోంది. సరైన ఆదాయం లేక తగిన వైద్యం కూడా పొందలేని పరిస్థితుల్లో అనేక కుటుంబాలున్నాయి. 2020లో ఈ ఉద్యోగ నష్టాలు సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. కేంద్రం ఇటువంటి తీవ్రమైన సమస్యను పట్టించుకోకుంటూ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కొద్దిపాటి ఆర్థిక ఉద్దీపన చర్యలు కూడా జీవనోపాధి పునరుద్ధరణ, ఉద్యోగ కల్పనకు ఉపయోగపడలేదు. జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు నగదు బదిలీ కల్పించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ, ప్రభుత్వ తరహా సంస్థల్లో ఉన్న లక్షలాది ఉద్యోగ ఖాళీలనూ సర్కార్ భర్తీ చేయలేడంలేదు. ఏదేమైనా ఇది విస్తృతమైన సమస్య. నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న వారిలో అధిక శాతం ఈ వర్గానికి చెందిన వారేనన్న విషయం మర్చిపోకూడదు.ఉపాధి కోసం పోరాటం ప్రధానంగా మహిళలకు సంబంధించినది, ఎందుకంటే మహిళల్లోనే ఎక్కువ శాతం ఉపాధికి దూరమవుతున్నారు. మరోవైపు నిరుద్యోగ సంక్షోభం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఉపాధిని సృష్టించేందుకు వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనా రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్మికులందరూ సమిష్ఠిగా పోరాడాలి.
ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళలు అవకాశాల్లో మాత్రం అట్టడుగునే ఉంటున్నారు.మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కతికంగా సాధించిన ప్రగతి చాలా స్వల్పమే. ఎన్‌డిఎ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ''బేటీ బచావో- బేటీి పఢావో''తో ప్రచారపటాటోపం ప్రదర్శిస్తోంది. గర్భంలో ప్రాణం పోసుకుంటున్న ప్రతి ఆడబిడ్డనీ పుట్టనివ్వడం, పుట్టిన ప్రతి ఆడబిడ్డకీ విద్య అందించడం మిధ్యగానే మిగిలింది. మహిళా సాధికారత గూర్చి ఐక్యరాజ్యసమితి ''మహిళా సాధికారతే మానవజాతి సాధికారత''ను 2011లో థీమ్‌గా నిర్ణయించారు. ఇప్పుడు అదే ఐరాస ఈ నివేదికను విడుదల చేసింది. ఆ థీమ్ ఇప్పటికీ డ్రీమ్ గానే ఉంది.