Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ ప్రజల కోసం యుద్ధం చేయాలనుకుంటే చేసేరు. సామ్రాట్టు బరితెగించాడు. 2024లో అధికారం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఆయన ''ఉత్తరా''న్ని నిలబెట్టుకోవాలి. దక్షిణా పథానికి తన ప్రభావాన్ని విస్తరించాలి. పరీక్షల్లో 'నిగ్గు'తేలిన తమ విధానాన్ని అమల్లోకి తేవాలి. అందుకు దండయాత్ర సాగిస్తున్నారు. సైనికుల ద్వారానో, ఆయుధాల ద్వారానో జరిగే దాడికాదది. దాని రూపమే భిన్నంగా ఉంటుంది. ''నాగపూర్‌లో ఆరెస్సెస్ పీఠం అనుకుంటున్నాం గాని, ఒక సారస్వత బ్రాహ్మిన్ లాయర్ 1940 కర్నాటకలోని మంగుళూరు సమీప గ్రామంలో ఒక ఆరెస్సెస్శాఖ ప్రారంభించారు. నేడు దేశంలోనే అత్యధిక ఆరెస్సెస్ శాఖలున్న ప్రాంతం మంగుళూరు ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఉడిపి ఉంది. అనేక మంది పీఠాధిపతుల కేంద్రం అది. క్రమ క్రమంగా లోపలి నుండి కొరుక్కుతిన్న ఫలితంగా 1991లో మొట్టమొదటిసారి మంగుళూరు పార్లమెంటరీ స్థానం కాంగ్రెస్ నుండి బీజేపీ గెల్చుకుంది. ఇక్కడే 'శ్రీరామ సేనె' పుట్టింది. ప్రమోద్‌ముతాలిక్ గతంలో పబ్‌లో మహిళలపై దాడిచేసిందిక్కడే. ఆ తర్వాత ధార్వడ్లో ప్రొఫెసర్ కల్బుర్గిని హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసి కాల్చి చంపారు. ఆ ప్రాంతంలో వెలువడే తొమ్మిదింట ఏడు దినపత్రికలు హిందూత్వ భావ జాలాన్ని ప్రచారం చేస్తాయి. ఇక టీవీ చానెళ్లైతే ఈ భావజాల ప్రచారానికి 'బేర్ ఫుట్ వలంటీర్ల''ని పామేలా ఫిలిపోస్ రాశారు. హిందూత్వ భావజాలాన్ని అనుసరించడం ఒక కామన్ సెన్స్ పాయింట్‌గా మారేవరకు ఈ దండయాత్ర సాగుతూంటుంది. ఇదీ నేపథ్యం. రామానుజుల ఆశ్రమాన్ని చివరికి మరో 'మంగుళూరు'గా మారుస్తారేమో మన రాష్ట్ర పాలకులూ! జర పైలం!
ఈ దశలో ''అవసరమైతే'' బీజేపీతో యుద్ధం చేస్తా! ''అవసరమైతే'' ఫెడరల్ ఫ్రంట్ పెడ్తా! ''అవసరమైతే'' ఢిల్లీ వెళ్లి రైతాంగ సమస్యలపై ధర్నా చేస్తా! వంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రివర్యుల నోటి నుండి జాలువారడం ప్రభుత్వాన్ని నగుబాటుకు గురిచేస్తున్నవి. ఎవరికి అవసరమైతే? సీయంకా? టీఆర్ఎస్ పార్టీకా? రాష్ట్ర ప్రజలకా? సింగరేణిని దెబ్బతీసేవి, మన రైతాంగాన్ని సర్వనాశనం చేసేవి, మన యువతకు కొలువులు లేకుండా చేస్తున్నవి కేంద్ర ప్రభుత్వ విధానాలే. తాజా నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా గత 50/60 ఏండ్లుగా నిర్మించుకున్న ప్రభుత్వరంగాన్ని, అంటే మన ప్రజల చెమట, రక్తాన్ని కార్పొరేట్ల దొడ్లో తోడిపోస్తున్నారు. ఇప్పటికే కోలిండియాలో 33శాతం వాటా ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉంది. దాన్ని కార్పొరేట్ గద్దలు తన్నుకుపోయిన తర్వాత ఇక మన సింగరేణి బతికి బట్టకట్టేదేముంది? మోడీ హుకూమత్లో హెచ్ఎంటి, హెచ్ఎంటీ బేరింగ్స్ వంటివి మూసివేతకు గురికాగా, ఆర్డర్లులేక కడుపు మాడ్చుకునేవి ఎన్నో. చివరికి మన దేశరక్షణ రంగమే ప్రయివేటు వారి చేతిలోకి పోతున్నది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మొదలు బి.డి.ఎల్., బి.ఇ.ఎల్, హెచ్.ఎ.ఎల్. వంటివెన్నో కష్టాల కడలిలో మునిగి తేలుతున్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలే. వీటి రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం చేయాల్సిందే. అవన్నీ మునిగిపోతే మన సింగరేణీ మిగలదని తెలియని అమాయకులు కాదు మన పాలకులు.
రైతాంగ సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఎప్పుడో వచ్చింది. 'అవసరమైతే' ఢిల్తీ వెళ్తాననే ఛాన్సే లేదు. పేరుకు మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించినా దొడ్డిదోవలో తెచ్చేందుకు మోడీ కార్పొరేట్ మిత్రులు వత్తిడి చేస్తున్నారు. ఫసల్ బీమా అమలు కావడం లేదు. వడ్డీ మాఫీ పేరెత్తేవాడు లేడు. కిసాన్ సమ్మాన్ యోజన అటకెక్కింది. భూసార పరీక్షలు లేవు. వీటన్నిటికి రైతు ప్రయివేటు అప్పులకేపోతున్నాడు. రిజర్వు బ్యాంకు రూల్స్ ప్రకారం 20లక్షల కోట్ల రూపాయలు రైతాంగానికి అప్పులు దొరకాలి. కేంద్రం ఇస్తానంది 16లక్షల కోట్ల రూపాయలు. ఇచ్చింది 8లక్షల కోట్లు కూడా లేదు. పంచపాండవులు.. మంచం కోళ్ల సామెతలాగానే ఉంది కదూ! కనీస మద్దతు ధర లేదు. కేంద్రం కొనడం లేదనే పేర మన రాష్ట్ర ప్రభుత్వమూ కొనడం లేదు. ఇవన్నీ రైతాంగం ఎదుర్కొనే కొన్ని సమస్యలు. ''లేస్తే మనిషిని కాదంటూ కూర్చునే ఉంటే ఉపయోగం ఏమిటి? రెండు కాళ్లూ లేకపోతే ఊతం కర్రలతోనైనా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. కాళ్లు ఉండి మన ప్రజలందర్నీ కదిలించి పోరాటం చేస్తే మరీ మంచిది.
అది మన తెలంగాణ యువతకు ఉపాధి కోసం కావచ్చు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత వాతావరణ పునరుద్ధరణ కోసం కావచ్చు, మత కార్చిచ్చు విస్తరించకుండా కావచ్చు... బీజేపీ విధానాలను టీఆర్ఎస్ ప్రతిఘటించడం అవసరం. బీజేపీ ప్రమాదాన్ని, సంఫ్‌ుపరివార్ పద్ధతు లను కాంగ్రెస్ అసలు గుర్తించనేలేదు. కనీసం బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలైనా గుర్తెరిగితే మనదేశ రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి.