Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చారిత్రాత్మక నిర్ణయం అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. దేశంలోని అత్యున్నత పథóకం దళితబంధు అన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా మొదటి విడతగా 100 మందికి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. మార్చి బడ్జెట్ నందు నియోజకవర్గ పరిధిలోని 2000 మందికి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం అన్నారు .అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. తమ అభివద్ధిని తామే నిర్వహించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైననాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందన్నారు .పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అయన పేర్కొన్నారు .ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని, అది దష్టిలో ఉంచుకుని వివిధ రకాల యూనిట్లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిమాండును బట్టి యూనిట్లు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. శాఖల వారిగా యూనిట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను బట్టి నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎస్సీలను వ్యాపారులుగా తయారు చేయుటలో బిజినెస్ అవగాహన కల్పించి ఆర్ధికాభివద్ధి సాధించడానికి అధికారులు ఆలోచన చేయాలని చెప్పారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు 9 లక్షల 90 వేలు చెల్లించి, మిగిలిన 10 వేలకు ప్రభుత్వ వాటాగా 10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దురదష్టవశాత్తు మరణించిన లబ్దిదారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధి ఒక ఇన్సూరెన్సు వలే ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ దళితబంధు నోడల్ అధికారి రాజేశ్వర్ రెడ్డి, ఈ.డి.ప్రవీణ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్.టీ.ఏ.అధికారి.రఘునందన్‌గౌడ్, సరూర్‌నగర్ ఎం.ఆర్.ఓ.రామ్మోహన్, హయత్‌నగర్ డిప్యూటీ తహశీల్దార్ కష్ణ, మేడ్చల్ ఈ.డీి.బాలాజీ, మరియు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్ రెడ్డి, భవాని ప్రవీణ్, సాగర్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, శ్రీధర్‌గౌడ్, శ్రీశైలం యాదవ్, రాజిరెడ్డి, చిరంజీవి, జక్కిడ..మాల్లారెడ్డి, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, అనిల్ కుమార్ చౌదరి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యమకారులు, మాజీ అధ్యక్షులు, పలు కమిటీ సభ్యులు, మహిళలు, దళితబంధు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.