Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువత క్రీడల్లో రాణించాలి : ఎంపీపీ వైఎస్ఆర్
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా వాలీబాల్ పోటీలను మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని ఎంపీపీి చేతుల మీదగా టాస్ వేసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఏదో ఒక క్రీడను ఎంచుకొని నిరంతరం సమయాన్ని వధా చేయకుండా మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందే విధంగా ఆటలు ఆడాలన్నారు. వారి కోసం వైఎస్ రెడ్డి ట్రస్ట్ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
అంకుషాపూర్ గ్రామంలో ఉన్న యువత అన్ని క్రీడల్లో రాణిస్తున్నారని, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సర్వి కష్ణగౌడ్ టీిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ రాజు, నాయకులు మల్లేష్, రాజశేఖర్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, 6 జట్ల వాలీబాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.