Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని జెడ్.పి రోడ్ తెలంగాణ చౌరస్తాలో డ్రయినేజి వ్యవస్థ లోపం వలన మురుగు నీరు రోడ్డుపైన ప్రవహిం చడంతో స్థానిక ప్రజలు వాహన దారులు ఇబ్బందులు పడుతు న్నారు. సాహితి కళాశాల దగ్గర ఉన్న కల్వర్టు దగ్గర అధికంగా వ్యర్థాలు వేయడం వలన కావడం వలన మ్యాన్‌హోల్స్ నిండుకొని స్థానిక కాలనీ రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయని స్థానిక ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జీహెచ్‌ఎంసీి మరియు జలమండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలనీలు మురికి కూపంలా తయారయ్యాయని, తమ గోడుని పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు, జీహెచ్‌ఎంసీి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి సమస్యలు పునరావత్తం కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.