Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హయత్నగర్ డివిజన్ పరిధిలోని అన్గల్ ఓల్డ్ విలేజ్లో పురాతన శివాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారుడు జెనిగె విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ ధూమ్ ధామ్తో పాటు ప్రపంచ యుద్ధాలు వద్దు శాంతి చర్చలు ముద్దు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రాలకు వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కొంతం యాదిరెడ్డి, అంబేద్కర్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారంద స్వామి, సీనియర్ జర్నలిస్టులు శోభనాల కుమార్, శేఖర్ పగిళ్ల, ఆర్కే భీంపాకు, సత్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాడిగాల్ల శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ సాంస్కతిక మండలి యాకన్న కళాబందం ఆట పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాటేపాక శివకుమార్, కారంగుల నరేందర్ గౌడ్, తాటి ఎల్లయ్య, దుబ్బాక నవీన్, మనోహర్, జెనిగె వేణు, భీమయ్య, హయత్నగర్ డివిజన్ వాసులు, బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.