Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లోని కుంటను ఎస్ఎఫ్ఐ నేతలు బుధవారం సందర్శించారు. 'కుంట అంతా ప్లాస్టిక్ చెత్తాచెదారంతో నిండిపోయింది. పూజ సామాన్లు, సీసాలు, చిత్రపటాలు ప్లాస్టిక్ వస్తువులు బయటి వ్యక్తులు వచ్చి విచ్చలవిడిగా పడేస్తున్నారని ఈ కుంటను జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్లాగా వాడుకుంటున్నారు' అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల దీన్ని పట్టించుకునే నాథుడే లేడు. యూనివర్సిటీ అధికారులు వెంటనే ఈ చెత్తను తొలగించి విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఓయూ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు కామ్రేడ్ విజరు నాయక్, కామ్రేడ్ కరణ్ పాల్గొన్నారు.