Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారతదేశపు ప్రముఖ మహిళల సంరక్షణ బ్రాండ్ విష్పర్ తన కిప్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఉద్యమంలో భాగంగా 'ది మిస్సింగ్ చాప్టర్' పేరుతో కొత్త చిత్రాన్ని ఆవిష్కరించినట్లు లియో బర్నెట్ ఇండియా సీఈవో, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రాజ్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిప్ గర్ల్స్ ఇన్ స్కూల్ అనే తమ ఫ్లాగ్ షిప్ పోగ్రామ్ విషయంలో నిబద్ధతతో విష్పర్ రూపొందించిన ఈ ప్రచార చిత్రం ప్రధానంగా అమ్మాయిలకు పీరియడ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆమె పాఠశాల రోజులు ఎలా తప్పిపోతాయో వివరిస్తుందన్నారు. భారతీయ పాఠ్యపుస్తకాల్లో పీరియడ్ల గురించిన అవగాహన స్పష్టంగా లేకపోవడం వల్ల పరిస్థితి తీవ్రమైందన్నారు. పీరియడ్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన పెంచే తన సంపూర్ణ విధానంలో ది మిస్సింగ్ చాప్టర్ సందేశాన్ని బయటకు తీసుకురావడానికి దేశవ్యాప్తంగా 25 ప్రభావవంతమైన వాల్ పెయింటింగ్ లతో క్షేత్రస్థాయిలో అవగాహన పెంచే దిశగా విష్పర్ పని చేస్తుందన్నారు. రుతు ఆరోగ్యం చుట్టూ ఉన్న ఈ ఆంక్షలను వదిలించుకోవడానికి యువతుల జీవితాలను మెరుగుపర్చడానికి భారతదేశంలో వంద శాతం రుతు పరిశుభ్రత సాధించడానికి మహిళల నుంచి విష్పర్ ఒక శక్తిగా బలంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.