Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీతాఫల్‌మండీ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తున్నామని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు గురువారం మైలార్‌గడ్డలో పర్యటించి కలుషిత నీటిసమస్యలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి కలుషిత నీటి సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయంలో టెండర్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్, టీఆర్ఎస్ నాయకులు రాజేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.