Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం అంబర్‌పేట డివిజన్ ఆకాష్ నగర్లో రూ. 32 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో సిమెంట్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు, ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు, డ్రయినేజీ పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈలు సుధాకర్, సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, ఎలక్ట్రికల్ డీఈ వెంకటరమణా రెడ్డి, ఏఈ రాఘవేందర్, వాటర్ వర్క్స్ ఏఈ కుషాల్, టీఆర్ఎస్ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షులు సిద్దార్థ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రాగుల ప్రవీణ్ పటేల్, జాకీ బాబ్, లత, జనరల్ సెక్రెటరీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.