Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
నారపల్లి నుంచి ఎదులాబాద్ రోడ్డును ఆర్ అండ్ బీఎస్సీతో కలిసి మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారానికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలానికి ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది. దీనికి సహకరించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆర్ అండ్ బి చీఫ్ గణపతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయాలకతీతంగా మండల అభివద్ధి కోసం నిరంతరం తన వంతు కషి చేస్తానని తెలిపారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ కాలేరు సురేష్, ఆర్.ఎంబి ఏఈ. శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.