Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సీవెరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ యం.దానకిషోర్‌ను ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌నగర్, సిలికాన్ కాలనీ, సాయిగూడెం, మోడీ బిల్డర్, మారుతీనగర్, సాయినగర్, మైసమ్మగుట్ట, సూర్యనగర్, మరియు గుంటి గూడెం, మిషన్ భగీరథ నీటి పైప్‌లైన్ లేక నీటి కొరత ఉన్నందున, ఆయా ప్రదేశలాల్లో మిషన్ భగీరథ నీటి లైన్ వేయుటకు మరియు ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణ పనులు కొరకు 7 కోట్ల 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించగలరని కోరుతూ వినతి పత్రాన్ని అందజేమన్నారు. సానుకూలంగా స్పందించిన యండి, ఉన్నతాధిóకారులు చర్చించి అతి త్వరలో మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ వచ్చేలా చూస్తామని తెలిపారు.