Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువులోని గుర్రపు డెక్క తొలగింపు ట్రాస్ ఫ్లోటింగ్ కలక్టర్ మిషనరీ యంత్రాన్ని గురువారం జీహెచ్‌ఎంసీి అధికారులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గుర్రపుడెక్కను తొలగించు ట్రాస్ ఫ్లోటింగ్ కలక్టర్ మిషనరీ యంత్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ చెరువులలోని గుర్రపు డెక్కను క్లీన్ చేసే 6 యంత్రాలను 12 కోట్ల వ్యయంతో కొన్నారని, దానిలో ఒకటి మల్కాజిగిరి జోన్‌కు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. చెరువుల్లో గుర్రపు డెక్క పెరగడంతో దోమలు వద్ధి చెంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, దోమల నివారణ కోసమే యంత్రాల కొనుగోలు చేశారని ఎమ్మెల్యే మైనంపల్లి పేర్కొ న్నారు. కమిషనర్ మన మల్కాజిగిరిని దష్టిలో పెట్టు కొని ఒక మిషనరీ యంత్రాన్ని సపిల్గూడ మినీ ట్యాంక్ బండ్ లో ప్రారంభించడం, గుర్రపు డెక్కను తొలగించి చెరువులను క్లీన్ చేసి ప్రజలను దోమల బెడద నుంచి కాపాడి చెరువు లను సుందరి కరిగించేందుకు కషిచేసిన కమిషనర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ సత్య, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజిగిరి అధికార ప్రతినిధి జీఎన్వీ సతీష్ కుమార్, మల్కాజిగిరి మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్ష కార్యదర్శులు పిట్ల శ్రీనివాస్, బి.సాయిగౌడ్, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్ధం పరశురామ్రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పిట్ల నాగరాజు, నర్సింగ్ రావు, సురేష్, సూరి, ఉపేందర్, సంతోష్ రాందాస్, సత్యనారాయణ, సీిహెచ్ మహేష్, రవి, బాబు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.