Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల ఆత్మగౌరవ ప్రతీక డబుల్ ఇండ్లు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్(ఓల్డ్) మారేడ్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ˜ి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి హాజరై లాంఛనంగా ప్రారంభించి, లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించా లన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో రూ.36.27 కోట్లతో 468 ఇండ్లను నిర్మించగా తొలివిడతగా 240 మందికి లబ్దిదారులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వారం రోజులుగా ఎమ్మెల్యే సాయన్న, మంత్రి శ్రీనివాస్ యాదవ్ నేతత్వంలో ప్రారంభ ఏర్పాట్లు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, ఇంకా పలువురు నాయకులు కూడా మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా భారీ స్థాయిలో కటౌట్లను ఏర్పాటు చేశారు.