Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల నందన వనం కాలనీలో నివాసముండి గుడిసెలు కోల్పోయిన వారికి జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఇల్లు కేటాయించాలని నిరాశ్రయులు డిమాండ్ చేశారు. గురు వారం నూతనంగా నిర్మించిన నివాస గహాల వద్ద గుడిసెలు కోల్పోయిన వారంతా సమావేశమై ప్రభుత్వం నిర్మించిన 512 గహాల్లో తమకు కేటాయించాలని వారు అన్నారు. నగర శివారులో ఉన్న కూకట్పల్లి లాంటి ప్రాంతాల వారికి ఇక్కడ కేటాయించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. గహాలు నిర్మించే ముందు గుడిసెలు ఖాళీ చేసిన వారికి ఇల్లు నిర్మించిన తర్వాత కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దష్టికి తీసుకువెళ్లగా వేరే ఎక్కడైనా ఇల్లు నిర్మించి ఇస్తే వెళ్తారని కోరినట్లు వారు తెలిపారు. తాము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నామని, వేరే ప్రాంతాలకు వెళ్తే తమకు తినడానికి తిండి లేక అప్పు ఇచ్చే వారు కూడా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతుమని వారన్నారు. డివిజన్ అధ్యక్షులు అందోజు సత్యంచారి, ఆ ప్రాంత టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు భూపేష్ గుప్తానగర్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని మీకు న్యాయం చేసే విధంగా కషి చేస్తామని తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లను ఆక్రమించుకొని కిరాయిలకు ఇచ్చారని వారిని వెంటనే ఖాళీ చేయించాలని వారు కోరారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. 2014 నుండి 19 వరకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి లేకపోవడంతో కొందరు వ్యక్తులు కావాలని ఇలాంటి పరిస్థితి తెచ్చారని పేర్కొన్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అనిత ఆది, బద్రి, రామకష్ణ, బ్రహ్మానందం, మురళి, భీంలాల్ నాయక్, చందు, సైదాబీ తెలిపారు.