Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
మహిళలు ఆత్మవిశ్వాసంతో అబివృద్ధి పథంలో ఎదగాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు మహారాణిలాగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారని వివరించారు. పుట్టినప్పటి నుంచి వద్ధాప్యం వరకు స్త్రీలకు పలు పథకాలు రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని తెలిపారు. అమ్మ, అమ్మమ్మలను నేటి తరం వారు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కమిషన్ చైర్మెన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో వివక్షకు, గహ హింసకు గురి అవుతున్నారని చెప్పారు. చిన్న తనంలోనే ఆడ పిల్లల్లో అవగాహన కల్పించాలని, మహిళల రక్షణకు పలు చట్టాలను రూపొందించామని తెలిపారు.