Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా దినోత్సవం సందర్భంగా కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజ్జులత స్పెషల్ ఇంటర్వ్యూ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల ఆలోచన విధానం మారిందని కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వి. విజ్జులత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ప్రవేశ పెట్టడం వల్ల తల్లిదండ్రులకు ఆడ పిల్లలను చదివించాలనే ఆలోచన పెరిగిందన్నారు. చాలా మంది అమ్మాయిలు సివిల్స్, గ్రూప్స్ వంటి వాటికి కోచింగ్ సౌకర్యం కల్పించాలని అడుగుతున్నారని తెలిపారు. అమ్మాయిలు ఉన్నత విద్యావంతుల అయితే వారు ఆర్థికంగా తమ కాళ్లమీద తాము నిలబడగలుగుతారని అన్నారు. గతంతో పోల్చితే అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు చదువుతున్నారు అని తెలిపారు. దీనికి కారణం ప్రభుత్వం తీసుకువచ్చిన 'దోస్త్' అని చెప్పారు. కోఠి ఉమెన్స్ కళాశాలలో హాస్టల్ సీట్ దొరకాలంటే 92 శాతం నుంచి 95 శాతం మెరిట్ సాధించాల్సి ఉంటుంది అన్నారు. అమ్మాయిలకు సరిపడా హాస్టల్ లేక 500 మంది ఉండాల్సిన హాస్టల్లో వెయ్యిమంది ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. కోఠి ఉమెన్స్ కళాశాలలో హాస్టల్ వసతులు, అదనపు తరగతులను పెంచితే ఎంతోమంది గ్రామీణ అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి కలిసి వివరిస్తామన్నారు. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే అని తెలిపారు.