Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ కం ట్యాక్స్ కమిషనర్ కోమలి కృష్ణన్ ొబాగ్అంబర్పేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
నవతెలంగాణ-అంబర్‌పేట
రొమ్ము క్యాన్సర్‌పై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఇన్ కం ట్యాక్స్ కమిషనర్ కోమలి కృష్ణన్ అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురష్కరించుకుని శుక్రవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ సీఈ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఉదాన్ ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సహాకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. క్యాంప్‌లో మాజీ కార్పొరేటర్ పద్మావతి డీపీరెడ్డితో పాటు కోమలి కృష్ణన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తూ దూసుకుపోతున్నారని అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించుకుని మహిళలుతమ ఆరోగ్యన్ని కాపాడుకోవాలని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌లో మ్యామోగ్రామ్, ప్యాప్స్మీర్, ఆల్ట్రా సౌండ్ వంటి టెస్టులను చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు విద్యాసాగర్, రాధ, అలివేలు దుర్గ, డాక్టర్ గీత, అరుణ, సరోజ, అమ్మాజీ, ఎంఎన్‌జే డైరెక్టర్ జయలత, ప్రసాద్, డాక్టర్ సౌజన్య, కాలనీ ప్రతినిధులు వెంకటరావు, సత్యనారాయణ, యాదగిరి, పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.