Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కింగ్ కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ పద్మజా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనుష్ టీకాల పంపిణీ చేస్తున్నట్లు కింగ్ కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ పద్మజా తెలిపారు. శుక్రవారం కోఠిలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ క్లస్టర్ పరిధిలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మిషన్ ఇంద్రధనుష్ టీకాలు పంపిణీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. చిన్న పిల్లలకు టీకాలు ఇప్పించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తమ క్లస్టర్ పరిధిలో 1730 చిన్నారులు, 467 టీకాలు తీసుకోని గర్భిణీలు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడి సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటెన్స్ ఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు (ఐఎంఐ) టీకాలు వారం రోజుల పాటు అందిస్తామన్నారు. సమావేశంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.