Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో కన్వీనర్ వి భారతి తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు, బధిరుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఆర్డీ జాతీయ అధ్యక్షులు ఎండీ మున్నా, రాష్ట్ర నాయకులు కాటమోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.