Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్ 3లో గల ఐఈపీఎల్ కంపెనీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ జీడిమెట్ల, గాంధీనగర్ క్లస్టర్ అధ్యక్ష కార్యదర్శులు కీలుకాని లక్ష్మణ్, వి.ఈశ్వర్రావులు డిమాండ్ చేశారు. శుక్రవారం కార్మికులకు మద్దతుగా పరిశ్రమ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను ఒక నెల జీతం ఇస్తాం వెళ్లిపోవాలని యాజమాన్యం బయటకు నెట్టి వేయడం సరైంది కాదన్నారు. కంపెనీ యజమాన్యం కార్మికులను అకారణంగా తొలగించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర కంపెనీ కోసం భూమి తీసుకుని చిన్న చిన్న షెడ్లు వేసి లక్షల్లో అద్దెలకు ఇచ్చి వసూలు చేయడంగాక కార్మికులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఐఈపీఎల్ యజమాన్యం యూనియన్‌తో చర్చించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు వేణుగోపాల్, రామచంద్రుడు, ఆగమయ్య, గురవయ్య, కె.నర్సింగ్‌రావు, వాహెద్ తదితరులు పాల్గొన్నారు.