Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం డివిజన్లోని కుమ్మరికుంట నుంచి ఎస్సీ కమ్యూనిటీ హాల్ వరకు రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులను జీహెచ్ఎంసి అధికారులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివద్ధిని, సంక్షేమ పథకాలను రెండింటిని సమానంగా తీసుకు వెళ్తున్నారని కొనియాడారు. పైప్ లైన్ పనులు జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాజ్‌కుమార్, వర్క్ఇన్స్పెక్టర్ కేదార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, బాణాల నారాయణ రెడ్డి, కాంట్రాక్టర్ పాండు తదితరులు పాల్గొన్నారు.