Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదర్‌నగర్ డివిజన్లోని అన్ని కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరుస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో రూ.30లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ గోవర్ధన్‌గౌడ్, ఏఈ రాజేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ దేవి, ఎస్ఎఫ్ఐ వెంకటావ్రు, డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, ఆదిత్యనగర్ కాలనీ వాసులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంబాబు, గోపి, డివిజన్ నాయకులు వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ , కుమార స్వామి, మహేశ్‌రెడ్డి, అప్పిరెడ్డి, సూరపనేని గోపిచంద్, సుధాకర్‌రెడ్డి, యుగేష్రెడ్డి, రాజుసాగర్, కృష్ణ, అనిల్, సన్నీ, రాజు, శ్రీనివాస్, సుమన్, మహిళ నాయకురాలు కృష్ణకుమారి, లక్ష్మి, ప్రమీల, రేణుక తదితరులు పాల్గొన్నారు.