Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
కాలనీల్లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌లో కార్పొరేటర్ ఆవుల రవీందర్‌తో కలిసి పర్యటించారు. ఆరేండ్లుగా ఇక్కడి పేదల కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. డ్రయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. రోడ్లు, విద్యుత్ పోల్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ బస్తీలో కూడా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ, రోడ్డు వేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా అంచనాలు తయారు చేయాలని ఏఈకి సూచించారు. బస్తీకి అనుసంధానంగా ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో కల్వర్ట్ను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కంచి బిక్షపతి, స్థానికులు మల్లేష్, వెంకటేష్, కవిత, శేఖర్ పాల్గొన్నారు.