Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నలుగురికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నలుగురి కారుణ్య నియామకాల ఆమోదానికి సంబంధించిన ప్రతిపాదనలను డీఈవో ఆర్.రోహిణి, ఏడీ శ్రీనివాస్ రెడ్డి, సూపరిటెండెంట్ జి.రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఖాజా సోహెల్ అహ్మద్ కలెక్టర్ ఎల్.శర్మన్‌కు పంపించారు. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు కె.ఆర్.రాజ్‌కుమార్, ఎం.భాస్కర్, జాయింట్ సెక్రటరీ ఇసాక్ ఖాన్, ఈసీ ముజాహిద్, ప్రియా, వారి కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో ఆర్.రోహిణికి పూలబోకే అందించి శాలువతో ఘనంగా సన్మానించారు. సీఎం ఆదేశాల మేరకు త్వరతిగతిన కారుణ్య నియామకాలు చేపట్టినందుకుగాను జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్, డీఈవో ఆర్.రోహిణి, డీఆర్వో సూర్యలత, ఏవో అయ్యప్ప, కలెక్టర్ సీసీ సీతారాం, సీనియర్ అసిస్టెంట్ ఆశ్వినికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీవన్, రాజశేఖర్, సోహేల్, రాణి, రమేష్, ఫయాజ్, రాకేష్, సాదాత్, కుషాల్, పూర్ణిమ, జమీల్, సబ్దిర్, రవి, పరమేష్ పాల్గొన్నారు.