Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
గతంలో భూదానోద్యమం చేపట్టిన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భూమి ఆత్మగౌరవం నినాదంతో ఆనాటి భూదానోద్యమం స్ఫూర్తిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాద యాత్రలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు, కుత్బుల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి నేతృత్వంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ సిద్దేశ్వర్ లోతులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానందం, రాష్ట్ర, ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్‌గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఐలయ్యగౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, నీలి రహమతుల్లా, పరశురాం గౌడ్, వీరేశ్, పెంబల్ల సంజీవ్, రాధాకృష్ణ, గపూర్, లాల్ మొహమ్మద్, సైదాబీ సుజాత, ఎల్లేశ్, నాగరాజు, చెవిటి శ్రీనివాస్, సిరిగళ్ల బాబు, జంగా రెడ్డి, వినీత్ తదితరులు పాల్గొన్నారు.