Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కూకట్పల్లి కార్యదర్శి ఎం.శంకర్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదర్‌నగర్ బస్తీకి స్మశాన వాటిక ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు శనివారం కూకట్పల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కూకట్పల్లి కార్యదర్శి ఎం.శంకర్ మాట్లాడుతూ హైదర్‌నగర్ బస్తీలో గత వారం రోజులుగా స్థానిక సమస్యలపై సర్వే చేస్తున్నారని, ఈ బస్తీకి స్మశాన వాటిక అభివృద్ధి లేక ఆలీతాలబ్ పక్కన ఎవరైన మృతి చెందితే బొందలు పెడుతున్నారన్నారు. గత ఐదేండ్లుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, మేయర్, మున్సిపల్ కమిషనర్, మండల తహశీల్దార్, కలెక్టర్‌కు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ దామాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తుంది. కాని ఈ బస్తీలో స్మశాన వాటికను అభివృద్ధి చేయడం లేదన్నారు. ఇప్పటికైనా సమస్యను ప్రభుత్వం గుర్తించి స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని , లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, బాలు, శ్రీను, మహేష్, మహేష్‌గౌడ్, వెంకటేష్, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.