Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ముఠాలోని సరఫరాదారునితోపాటు ముగ్గురు కష్టమర్ల అరెస్టు
- 16 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వెస్టుబెంగాల్ నుంచి హైదరాబాద్‌కు గుటుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ముఠాలోని సరఫరాదారునితోపాటు ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 16 గ్రాముల హెరాయిన్, 5 సెల్ఫోన్లు, రూ.1900 నగదుతోపాటు వేయింగ్ మెషిన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ డీసీపీ రక్షితామూర్తి తెలిపిన వివరాల ప్రకారం... వెస్టు బెంగాల్‌కు చెందిన ఎండీ అక్తర్ ఉజ్జామాన్ ప్రయివేట్ సంస్థలో పనిచేస్తూ గచ్చిబౌలీ లో నివాసముంటున్నాడు. జార్ఖండ్‌కు చెందిన ఎండీ నాజీర్ కొండాపూర్‌లో నివాసముంటున్నాడు. వెస్టుబెంగాల్కు చెందిన షాజహాన్, ఒప్పు, మెహతాబ్ ఆలాంలు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న ఈ ముఠా వెస్టుబెంగాల్ నుంచి హెరాయిన్ (బ్రౌన్ షుగర్)ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తక్కువ ధరకు హెరాయిన్ కొనుగోలుచేస్తున్న నిందితులు నగరంలో గ్రాముకు రూ.5000 నుంచి రూ.6000ల వరకు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్ కూపీలాగారు. డీసీపీ కె.మురళీధర్ ఆదేశాలతో, ఏసీపీ ఎన్.శ్యాం ప్రసాద్ సూచనలతో విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, నాచారం పోలీసులతో కలిసి సంయుక్తంగా ముఠాపై ప్రత్యేక నిఘా వేశారు. జార్ఖండ్‌కు చెందిన వారిని సుచిత్రాలో షేక్ దినేష్, కొండాపూర్‌లో మెహబూబ్ ఖాన్, ఎండీ నాజీర్లను గుర్తించారు. వెస్టుబెంగాల్కు చెందిన ఎండీ అక్తర్ నుంచి వీరు డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించారు. అక్తర్‌తోపాటు కొనుగోలు చేస్తున్న ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.
పరారీలోవున్న వారి కోసం గాలిస్తు న్నామని డీసీపీ తెలిపారు. డ్రగ్స్ సరఫరా దారులతోపాటు కొనుగోలు దారులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, సరఫరా చేసినా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షపడు తుందని డీసీపీ హెచ్చరించారు.