Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్‌కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల యథేచ్ఛగా కొనసాగుతున్న భూ కబ్జాలపై సమాచారం సేకరించడానికి వెళ్లిన విలేకర్లపై దుండగులు దాడికి దిగడం హేయమైన చర్యల అని టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకర్ల బృందంతో కలిసి మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్‌కు, జాయింట్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జర్నలిస్టులపై భూ కబ్జాదారుల దాడులు పెరుగుతున్నాయని, వారిని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డమీది అశోక్, కూకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు డేవిడ్, డప్పు రామస్వామి, జెమినీ నాగరాజు, నర్సింగ్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విలేకరులు సుగ్రీవుడు, ఎం.డి. పాషా, మహేశ్, శివకుమార్, బి.ఎస్. బైరోజు మహేశ్, దివాకర్, రంజిత్, శివ, శీను నాయక్, జోగు వెంకట్, సంజీవ్ రెడ్డి, కృష్ణ పంతులు, రవీందర్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.