Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ కులగణన చేపట్టాలని, విద్యా ఉన్నత ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రత్యేకంగా బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. మార్చి 21 నుంచి మూడు వారాల పాటు ఢిల్లీలో కొనసాగబోయే ఈ వ్యూహాత్మక కార్యాచరణకు బీసీలందరూ తమ మద్ధతును ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కర్ణాటక రాష్ట్ర నాయకులు శివకుమార్, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీలం వెంకటేష్, బీసీ అడ్వకేట్ జేఏసీ చైర్మెన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు జగన్నాథం ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరీష్ గౌడ్, నాయకులు తాటికొండ సత్యనారాయణచారి, ఓం ప్రకాశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.