Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ విద్యానియంత్రణ కమిటీ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాసులు
నవతెలంగాణ-హస్తినాపురం
జనరల్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు 12 నెలల జీతాన్ని చెల్లించాలని కార్పొరేట్ విద్యానియంత్రణ కమిటీ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్నత విద్య, బీసీ, ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇస్తున్న 12నెలల వేతనాన్ని జనరల్ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయులకు కూడా చెల్లించాలని ఆయన కోరారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయు లకు ఏడాదికి పది నెలలకు చెల్లింపుకు బదులుగా పన్నెండు నెలల వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని సుమారు 20 సంవత్సరాల పైగా జనరల్ గురుకులాలలో పని చేస్తు న్న ఉపాధ్యాయులకు 12 నెలల వేతన చెల్లింపు నిర్ణయం తీసుకోక పోవ టం విస్మయం కలిగిస్తుం దన్నారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యా యులకు కేవలం 10 నెలల జీతాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని, వెంటనే వారికి 12 నెలల జీతాలు ఇవ్వడంతో పాటు వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో బాధిత ఉపాధ్యాయులకు అండగా అలుపెరుగని పోరాటాలు చేస్తామని చెన్నోజు శ్రీనివాసులు అన్నారు.