Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ముదిరాజులను బీసీ గ్రూప్ 'డి' నుంచి 'ఏ' గ్రూప్‌లోకి మార్చాలని సంఘం అధ్యక్షులు పిట్టల నాగరాజు ముదిరాజ్ కోరారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ చక్రిపురం సిరిగార్డెన్లో నిర్వహించిన సమావేశంలో సంఘం అధ్యక్షులు పిట్టల నాగరాజు ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ముదిరాజ్ కులాన్ని బ్యాక్ వార్డ్ క్లాస్ గ్రూప్ డి నుంచి 'ఏ' గ్రూపులోకి మార్చాలని పోరాటాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక దష్టి కేంద్రీకరించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే ముదిరాజుల ఐక్యమత్యంతో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డల పాండు ముదిరాజ్, సీనియర్ నాయకులు మల్యాల గణేష్ ముదిరాజ్, కనకయ్య ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, రామచంద్రుడు ముదిరాజ్, గిరిబాబు ముదిరాజ్, కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్, భరత్ ముదిరాజ్, జడల శంకర్ ముదిరాజ్, చింతల శేఖర్ ముదిరాజ్, సాయి ముదిరాజ్, రవి ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, హరిబాబు ముదిరాజ్ పాల్గొన్నారు.