Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దళిత సాహిత్యం విలువైనది అని, దానిని వెలికితీసేందుకు విద్యార్థులు కృషి చేయాలని ప్రముఖ వక్త, దళిత సాహిత్యకారులు జయప్రకాష్ కర్థమ్ అన్నారు. సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, రిసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో 'సమకాలిన్ సాహిత్య్ మే హషియే కా స్వర్' అనే అంశంపై రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. చింతా గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హషియే అంటే వివరిస్తూ వెనుకబడిన వర్గాలని ఇప్పటి వరకు భారతదేశ సమాజం గుర్తించనివని చెప్పారు. ప్రొ. సర్రాజ్ సెమినార్ అంశంపై విస్తత అవగాహన కల్పించారు. డీన్ హ్యుమానిటీస్ హెచ్సీయూ ప్రొ.క్రిష్ణ విజిటింగ్ ప్రొఫెసర్గా సందర్శించిన దేశాల్లో పరిస్థితులను వివరించారు. భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన జాతులను ఉద్దేశించి ఎందుకు వారిని ఆళావాదులు అంటారో క్షుణ్ణంగా వివరించారు. ఈ దేశంలో ఉన్నత వర్గాలకు మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని దళిత పీడిత ఆదివాసీ స్త్రీ విముక్తి కోసం రచనలు రావాలని సెమినార్లు నిర్వహించాలని అప్పుడే సమాజంలో వీరి స్థితి గతులు అవగతమవుతాయన్నారు. సెమినార్ అంశంపై ఎంపిక బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో హిందీ డిపార్ట్మెంట్ హెడ్ బీవోఎస్ డాక్టర్ మాయాదేవి, ప్రొ.సంగీత వ్యాస్, పరిశోధక, పీజీ విద్యార్థులు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.