Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వక్తలు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ.ఆర్. లింబాద్రి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఓయూ సీఐఎస్ కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ అధ్యక్షతన మూడు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ సాహిత్యంలో ఉన్న అపురూపమైన విషయాలను ఆంగ్లంలోకి అనువదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై యాభైకి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సాహిత్య సదస్సు మరో రెండు రోజులపాటు ఓయూ సీఐపీలో కొనసాగుతుందని డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణ రచయిత ఆ దేశ రవి, ఓయూ ఆర్ట్స్ డీన్ ప్రొ. మురళీకష్ణ, రిటైర్డ్ ప్రొ కరుణాకర్, యూజీసీ డీన్ ప్రొ.మల్లేశం, యశోద హాస్పిటల్స్ డాక్టర్ శశికాంత్, ఇన్స్పైర్ హార్ట్ ఫౌండేషన్ చైర్మెన్ లహరి, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ ముఖర్జీ, అధ్యాపకులు క్రిస్టఫర్, విజయ, ప్రవీణ, సవీణ్ సౌదా, అశోక్ పరిశోధక విద్యార్థులు ఎల్చల దత్తాత్రేయ, బాలకష్ణ, కిరణ్, వివిధ రాష్ట్రాల పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.