Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
గుండె శస్త్రచికిత్స విధానంలో అత్యాధునిక టెక్నాల జీతో సన్ షైన్ హాస్పిటల్ ముందుంది. భారతదేశంలోనే గుండె సంబంధిత చికిత్సల్లో అత్యంత అధునాథన 3 డీ మ్యాపింగ్ పద్ధతి, గుండెలో తలెత్తే సమస్యలను రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సుప్రావెంట్రిక్యులార్ బాచీ కార్డియా (ఎస్విటీ), గుండె ఎగువ భాగంలో సాధారణంగా కర్ణికల్లో వెట్రిక్యులార్ టాచీ కార్డియా (వీటి) గుండె దిగువ గదులు జఠరికల్లో ప్రారంభమైతుంది. ఈ టెక్నాలజీ ద్వారా రోగికి స్టెంట్ ఏ స్థానంలో వేయాలీ, ఎంత పొడవు, వెడ ల్పు, వ్యాసం ఉండాలనే విషయాలను ఖచ్చితంగా తెలుసు కోవచ్చునని డాక్టర్ శ్రీధర్ కస్తూరి వెల్లడించారు. సోమ వారం సికింద్రాబాద్లోని సన్ షైన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలే ఖర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. గతంలో ఉన్న టెక్నాలజీలో ఈ విషయాలన్నింటినీ తెలుసుకో వడం సాధ్యం అయ్యేది కాదన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా ఇంట్రా వాస్క్యులార్ ఇమేజింగ్ యాంజియో ద్వారా మార్గనిర్దేషం చేసిన యాంజియోప్లాస్టీ స్టెంటింట్ అనేది యాంజియో గైడెడ్ యాంజియోప్లాస్టీతో పోలిస్తే మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెప్పారు. ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయో గించుకోవాలని డాక్టర్ శ్రీధర్ కస్తూరి చెప్పారు. సోమవారం నూతనంగా తీసుకొని వచ్చిన గుండె 3డీ మ్యాపింగ్ ద్వారా స్టెంటును అమర్చుట యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజరు కుమార్ రెడ్డి, డాక్టర్ కె .కిరణ్ కుమార్, అనిల్ కుమార్, పీఎన్ రావు పాల్గొన్నారు.