Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజల కోసం రాంకీ సంస్థ చేస్తున్న సేవలు అభినంద నీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో రాంకీ సంస్థ ఫౌండే షన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జవహర్ డంపింగ్ యార్డు సమీపంలో ప్రజలకు తాగేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతకు ముం దు నాసిన్ చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు నాను నాయక్, సుజాత, హేమలత, మంగళపురి వెంకటేష్, సురేఖ, వసూపతి రమేష్ గౌడ్, స్వప్న, వెంకట రమణ, మాదిరెడ్డి నర్సింహ్మ రెడ్డి, మౌనిక, పట్టణ అధ్యక్షులు కౌకుంట్ల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, పట్టణ యూత్ అధ్యక్షులు మణికంఠ ముదిరాజ్, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులు, నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.