Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఓ విద్యార్థిని రాత్రి సమయంలో అకస్మా తుగా పాము కరవడంతో సమీప హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు గాంధీకి తీసుకెళ్లా లని చెప్పడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ విద్యార్థి సోమవారం మృతి చెందాడు. కీసర మండలం బొగారం గ్రామంలోని మహాత్మ జ్యోతి బాపులే బీసీ సంక్షేమ హాస్టల్లో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జి.శివ శంకర్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి శివశంకర్‌ను పాము కరవడంతో తోటి విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది పాము కాటుకు గురైన విద్యార్థిని సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించగా అక్కడి వైద్యులు గాంధీకి తీసుకెళ్లాలని తెలపడంతో వెంటనే విద్యార్థిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
బీసీ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్, అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్
జ్యోతిరావు పూలే గురుకుల బీసీ హాస్టల్లో హాస్టల్ నిర్వాహకులు, అధికా రుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందడని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్ అన్నారు. విద్యార్థి మృతి చెందిన హాస్టల్ ప్రాంతాన్ని పరిశీలించారు. హాస్టల్లో ఉపాధ్యాయులు, వార్డెన్స్ ఎవరూ స్థానికంగా లేకపోవడం వల్ల కొంతమంది టీచర్స్, వాచ్ మెన్స్ ఉన్నప్పటికీ విద్యార్థులు బయటికి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని, బాధ్యతగా చూడక పోవడం వల్లనే ఈ దారుణం జరిగిందన్నారు. విద్యార్థిని మృతికి కారకులైన గురుకుల హాస్టల్స్ వార్డెన్స్, ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ చుట్టు ముట్టు చెత్తాచెదారం ఉన్నప్పటికీ శుభ్రం చేసుకోకపోవడం వల్లనే శివశంకర్ అనే విద్యార్థి పాముకాటుతో మృతి చెందినట్టు తెలిపారు. వార్డెన్, వాచ్మెన్స్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు కారణమవుతున్నారన్నారు. ఇలాంగి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు వెంటనే తమ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకుని శివ శంకర్ మృతికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.