Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మహిళా భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి అధ్యక్షతన సుష్మ సాయినగర్ కాలనీ మహిళా అసోసియేషన్ వారు సోమవారం ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొసనం ధనలక్ష్మి మాట్లాడు తూ మహిళలు అందరు కలిసి స్కిల్ డెవలప్మెంట్, మీటింగ్ మహిళా సాధికారికత తదితర విషయాలకై మహిళా భవనం నిర్మించాలని కొసనం ధనలక్ష్మి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, టంగుటూరు నాగరాజు, స్థానిక మహిళలు శిల్ప, రాధిక, ప్రవీణ, జ్యోతి, కళావతి, ముస్క్ జ్యోతి, సుజాత నాయక్, నవ్య, విజయలక్ష్మి, కవిత, రాజ్యలక్ష్మి, స్వరూప వసంత, శ్యామల, శోభరాణి, కష్ణకుమారి, కొసనం ధనలక్ష్మి, (మహిళా డివిజన్ ప్రెసిడెంట్ ), కొసనం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.