Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూ పార్కుల ఐఎఫ్ఎస్ డైరెక్టర్ అక్బర్
నవతెలంగాణ-హైదరాబాద్
భూసంబంధమైన జీవవైవిధ్యానికి అడవులు నిలయమని జూ పార్కుల ఐఎఫ్ఎస్ డైరెక్టర్ ఎంజే అక్బర్ అన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో అంతర్జాతీయ అటవీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూలోని మజర్ గార్డెన్ ఏరియా, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ''నేరేడు'', ''మర్రి'', ''జామ'', ''మేడి'' మొక్కలను జూ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్, డిప్యూటీ క్యూరేటర్ ఎ నాగమణి లతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపద తోనే మానవ మనుగడ ఉందన్నారు. 'తెలంగాణకు హరితహారం' పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం అమలుచేస్తుందన్నారు. చెట్ల విస్తీర్ణం పెంచేందుకు అటవీ శాఖ పట్టణ బహిరంగ ప్రదేశాల్లోని వక్షసంపద కార్బన్ డయాక్సైడ్కు సింక్‌గా పనిచేస్తుందన్నారు. ఇవి కాలుష్యాన్ని తగ్గించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని, మనం పీల్చే గాలిి, మనం త్రాగే నీరు జీవన నాణ్యతను నిర్ణయించే రెండు ప్రాథమిక అంశాలు అని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జోజి, అసిస్టెంట్ క్యూరేటర్ సతీష్ బాబు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లు డి. నాగరాజు, యజ్దానీ, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.