Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పరిశ్రమల అభివద్ధికి ప్రభుత్వం నగరం నలుమూలల పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసిందని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి కార్పొరేషన్ (టీఎన్ఏడీసీ) చైర్మెన్ అమరవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కషితో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం కాచిగూడలోని దియా సుస్వాగత్ హోటల్లో సిల్క్ ప్లాస్టర్ సంస్థ చైర్మెన్ వెంకటరమణ అధ్యక్షతన పరిశ్రమల్లో యువత భాగస్వామ్యం అనే అంశంపై ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సదస్సులో వ్యాపార నైపుణ్యాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పరిశ్రమల స్థాపనతో లక్షలాది మంది యువతకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివద్ధి దిశగా పరుగులిడుతుందన్నారు. నగరం, శివారు ప్రాంతాలు 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాయని తెలిపారు. తెలంగాణ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకష్ణ, మూసీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సీఆర్ మాణిక్, నిర్మాత, దర్శకుడు సోమ విజయప్రకాశ్, నరోత్తమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.