Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షునిగా జల్పల్లి మున్సి పాలిటీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఖాజాఖాన్ను రంగా రెడ్డి జిల్లా బీజేపీి అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి నియమించి నియామకం పత్రాన్ని అంద చేశారు. ఈ సందర్భంగా బీజేపీి రాష్ట్ర నాయకులు, మాజీ సింగి ల్విండో చైర్మెన్ కొలను శంకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఖాజా ఖాన్ కలసి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొలన్ శంకర్ రెడ్డి ఖాజాఖాన్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఖాజాఖాన్ నాయకత్వంలో బీజేపీి మైనార్టీ వర్గానికి భాగానికి చెందిన సామాజిక వర్గాల వారిని బీజేపీి అంటే జాతీయవాదం దేశభక్తుల పార్టీని బీజేపీి అంటే భారతీయ జనతా అన్నివర్గాల అభివద్ధి, అన్ని వర్గాల వారిని విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లడమే ఆలోచన విధానం అన్నారు. మోదీ ప్రధానమంత్రిగా దేశ ప్రజలందరికీ ఒకటే అనే భావంతో ముందుకు తీసుకెళుతున్నారు. దేశ వ్యతిరేకులకు, ఉగ్రవాదులకు మాత్రమే బీజేపీ వ్యతిరేకం అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు రాంరెడ్డి, ప్రదీప్ గౌడ్ జూనియర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.