Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సినారె భౌతికంగా లేకపోవచ్చు. కానీ ఆయన రచించిన గీతాలు నేడే కాదు ముందు తరాలు కూడా గుర్తించుకొనే విధంగా వుంటాయని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై వంశీ ఆర్ట్స్ థియేటర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటకు షష్టిపూర్తి ఉత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిóగా సుఖేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సినారె వేషధారణలో, భాషా ఉచ్ఛారణలో తెలుగుతనం ఉట్టిపడుతుందని అన్నారు. తెలంగాణ గడ్డ పౖౖె పుట్టి దేశంలోనే ఉత్తమ కవిగా జ్ఞానపీఠ్, కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాలను పొందిన సినారె పాట, మాట మరువలేమన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.రమణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సాధారణంగా వ్యక్తులు షష్టి పూర్తి చేసుకొంటారని, పాటకు షష్టి అరుదని అన్నారు. గులేెబకావళి కథ సినిమాలో 'నన్ను దోచుకొందువటే' పాట రాసి 60 ఏళ్ళు దాటిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శుభోదయం మీడియా ద్వారా 366 రోజులు ఘంటసాల పాటల మహాయజ్ఞం చేసిన లక్ష్మీప్రసాద్‌ను అతిథులు సత్కరించారు. వంశీ రామరాజు స్వాగతం పలికిన సభలో మండలి బుధప్రసాద్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ , శైలజ, తెన్నేటి సుధ పాల్గొన్నారు. బాల కామేశ్వరరావు, సురేఖ, గీతాంజలి, శశికళ, వినోద్ బాబు పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి.