Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేను కలిసిన బండారి లేఔట్ 7-డి కాలనీవాసులు
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఔట్ రోడ్డు నెంబర్ 7-డి కి చెందిన కాలనీవాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తాము మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, నర్సింహారెడ్డి సంక్షేమ సంఘాల సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.