Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రామంతపూర్ డివిజన్లోని క్రాంతి డిగ్రీ యజమాన్యం, మ్యారీ స్వచ్ఛంద సంస్థ, ఆధ్వర్యంలో క్రాంతి కాలేజీ విద్యార్థులు, కాలనీవాసులు, జలమండలి అధికారులతో కలిసి నీటి ప్రాముఖ్యత తెలియజేసేందుకు ప్రగతినగర్లో ర్యాలీ చేపట్టి ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను తెలియజేశారు. జలం-బలం, జలం- సుజలం, సేవ్ వాటర్-అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ జాన్ షరిష్ డీజీఎం రజనీకాంత్ రెడ్డి , ఏఈ ఆసిఫ్ , క్రాంతి డిగ్రీ కాలేజ్ అధ్యాపక బందం మరియు విద్యార్థులు, స్థానికకాలనీ వాసులు, మ్యారి స్వచ్ఛంద సంస్థ బందం, రామంతపూర్ డివిజన్ టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. ముస్తాక్, ప్రధాన కార్యదర్శి జేసీబీ రాజు, నాయకులు తిప్పని సంపత్, సూరం శంకర్, బాలకుమార్, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కంకణాల శ్రీకాంత్ రెడ్డి వేముల సంతోష్ రెడ్డి నంది కంటి శివ, కంచెర్ల సోమిరెడ్డి, కవాటాల మల్లేష్, వేముల చిన్న సబిత తదితరులు పాల్గొన్నారు.