Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని స్కాలర్షిప్ పెంచాలని కోరుతూ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బీసీ నాయకులు గుజ్జ కష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మంగళవారం నాడు మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఈ ముట్టడికి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమా న్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయని అన్నారు. చాలా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించక పోవడంతో క్లాసు నుండి బయటకి పంపుతూ, బయట ఎండలో నిలబెడుతూ వారిని అవమానాల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది పేద విద్యార్థులు తమ చదువులకు స్వస్తి పలుకుతున్నారు .అంతేకాకుండా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫకెట్లు ఇవ్వకపోవడంతో వారు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని, అలాగే ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చినవారు ఆ ఉద్యోగాలలో చేరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ముట్టడిలో బీసీ నాయకులు అనంతయ్య, సతీష్, కష్ణ యాదవ్, రాజేందర్, మల్లేష్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.