Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
దేశ రవాణా రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఎంవియు యాక్ట్ 2019ని తీసుకొచ్చిందని, తక్షణమే ఈ యాక్ట్ రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సమ్మె కరపత్రాలను మంగళవారం ఆర్టీసీ హయత్‌నగర్ 1,2 డిపోల ముందు పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బల్క్ డీజిల్ ధరలను లీటరుకు 25 రూపాయలు పెంచడాన్ని సీఐటీయూ, ఎస్డబ్ల్యుఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ ధరల పెంపుతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ మరింత కష్టాల్లోకి నెట్టివేయబడుతుందని, కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి పెంచిన బల్క్ ధరలను తగ్గిం చాలని డిమాండ్ చేసింది. ఆర్టీసీని లాభనష్టాలతో చూడకుండా ప్రజా ప్రయోజనాల కొరకు నడిపేట్టు చూడాలని, అందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ యాజమాన్యం మేనేజర్లు కార్మికులపై వీఆర్ఎస్ ఒత్తిడి చేయడం కార్మికుల నివేదించడం ఇది తీవ్రమైన చర్య అని సీఐటీయూ, ఎస్‌డబ్ల్యు భావిస్తుంది. ఇప్పటికే రిటైర్ అయిన కార్మికులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని చుట్టూ తిట్టుకుంటూ ఇప్పుడు ఉన్న కార్మికులు వీఆర్ఎస్ తీసుకోమనడం విడ్డూరంగా ఉందన్నారు. వీఆర్ ఎస్‌ని సీఐటీయూ ఎస్‌డబ్ల్యూఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ టీిఆర్ఎస్ని వ్యతిరేకించాలని కార్మికవర్గానికి పిలుపు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ చట్టాలతో ఆర్టీసీలోని కార్మికవర్గం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది.ఆ చట్టాలలో ఉన్న అదనపు పని గంటలు పెంచడం, కార్మికవర్గం బార్గనింగ్ చేసే స్థితిని లేకుండా పోతుందన్నారు, టూరిస్ట్ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని, ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగించేలా టూరిస్ట్ పర్మిట్ విధానం ఉందన్నారు. ఆర్టీసీకి ఉన్న అప్పులను ప్రభుత్వ ఈక్విటీగా మార్చాలి, ఆర్టీసీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన పెట్టుబడిని పునరుద్ధరించాలీ, రాష్ట్ర బడ్జెట్లో 2 శాతం నిధులను ఆర్టీసీ లకు గ్రాంట్ గా కేటాయించాలి, ఆర్టీసీ ఫై తగ్గించాలి ఆర్టీసీ సంఘాలు పన్నులు తగ్గించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి.అరకొర నిధులు ఇచ్చి ఆదుకుంటున్న అని చెప్పి చెప్పే బదులు ఆయిల్‌పై పన్ను ఎక్స్చేంజ్ డ్యూటీ వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీని లాభాల నష్టాల ప్రతిపాదన గాకుండా ప్రజా రవాణా సమస్త గా చూడాలి, కార్మికులకు రావాల్సిన ఆరు డీజేలు అమలు చేయాలి,2013 వేతన ఒప్పందం హరియర్స్ చెల్లించాలి, లేబర్ కోడ్‌ను రద్దు చేయాలి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రజల ఆస్తులను పెట్టవద్దు డిమాండ్ చేస్తున్నాము. తదితర డిమాండ్ల తో జరిగే సమ్మెలో హయత్‌నగర్ 1, 2 డిపో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిం దిగా కార్మికులకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పిఆర్ రెడ్డి
సీఐటీియు జిల్లా ఉపాధ్యక్షులు నర్సిరెడి,్డ నాయకులు కష్ణయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.