Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోడ్ ఖాళీచేసే క్రమంలో రివర్స్ తీసుకుంటుండగా ఇద్దరు యువకులు మృతి
- జీడిమెట్ల పరిధిలో గాయత్రినగర్‌లో ఘటన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రశాంతంగా నిద్రిస్తున్న ఇద్దరు భవన నిర్మాణ కూలీలపై నుంచి లారీ దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా సత్పల్ల గ్రామానికి చెందిన సూరజిరామ్ కుమారుడు చందర్రామ్ (18), అదే ప్రాంతానికి చెందిన శివశంకర్ సహాని కుమారుడు చందన్‌కుమార్ (22) బతుకుదెరువుకోసం కొంతకాలం కిందట సిటీకొచ్చారు. నగర శివారులోని జీడిమెట్ల డివిజన్ పరిధి, గాయత్రినగర్‌లో బీమ్ అండ్ కాలమ్స్ బీల్డర్స్ చేపడుతున్న నిర్మాణం వద్ద ఉంటూ అక్కడే పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే పనులు ముగించుకుని సోమవారం రాత్రి ఆరు బయట నిద్రపోయారు. ఈ క్రమంలో భవన నిర్మాణానికి కావాల్సిన ఇనుప రాడ్ల లోడ్‌తో మంగళవారం తెల్లవారు జామున అక్కడికి వచ్చిన ఓ లారీ లోడ్ ఖాళీ చేసే క్రమంలో వెనుకకు తీస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే నిద్రిస్తున్న చందర్ రామ్, చందన్కుమార్లపైకి దూసుకుపోయింది. దీంతోవారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రరైవర్ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు యువ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని, మృతుల బంధువులు కోరుతున్నారు.